‘పురుగుల మందు’తో కూలీ మృతి

ABN , First Publish Date - 2020-03-04T10:34:12+05:30 IST

క్రిమి సంహారక మందు ప్రభావంతో నిర్మల్‌ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పెనుగొండ రాజేశ్వర్‌ (25) మంగళవారం మృతి చెందాడు. రాజేశ్వర్‌

‘పురుగుల మందు’తో కూలీ మృతి

మామడ, మార్చి 3 : క్రిమి సంహారక మందు ప్రభావంతో నిర్మల్‌ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ పెనుగొండ రాజేశ్వర్‌ (25) మంగళవారం మృతి చెందాడు. రాజేశ్వర్‌ ఇటీవల అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో క్రిమిసంహారక మందు పిచికారి చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత తల తిరుగుతుందని కుటుంబ సభ్యులకు చెప్పగా.. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. 

Updated Date - 2020-03-04T10:34:12+05:30 IST