ఉత్తమ టీచర్‌ అవార్డులు పొందిన వారిని అభినందించిన వీసీ

ABN , First Publish Date - 2020-09-16T22:06:33+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ టీచర్‌ అవార్డులు పొందిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యాపకులను వైస్‌ఛాన్సలర్‌ డా. ప్రవీణ్‌రావు బుధారం అభినందించారు.

ఉత్తమ టీచర్‌ అవార్డులు పొందిన వారిని అభినందించిన వీసీ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ టీచర్‌ అవార్డులు పొందిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యాపకులను వైస్‌ఛాన్సలర్‌ డా. ప్రవీణ్‌రావు బుధారం అభినందించారు. రాజేంద్ర నగర్‌లోని పరిపాలనా భవనంలోని కమిటీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రిజిస్ర్టార్‌ డా.ఎస్‌.సుధీర్‌కుమార్‌తో


కలిసి వైస్‌ఛాన్సలర్‌ వారిని సత్కరించారు. విశ్వవిద్యాలయాల ఉత్తమ ఉపాధ్యాయుల కేటగిరీలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఆరుగురు ప్రొఫెసర్లు ఈ అవార్డులు అందుకున్నారు. వైస్‌ఛాన్సలర్‌ డా. ప్రవీణ్‌రావు వారికి సర్టిఫికెట్‌లతో పాటు నగదు చెక్‌లను అందజేశారు అవార్డు పొందిన అధ్యాపకుల్లో ప్రొఫెసర్‌ ఎం. బలరాం, ప్రొఫెసర్‌ కె. విజయలక్ష్మి, ప్రొఫెసర్‌ ఆర్‌, విజయకుమారి, డా. కె. శ్రీనివాస్‌కుమార్‌, ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాసులు, ప్రొఫెసర్‌ కె.సురేష్‌ ఉన్నారు.

Updated Date - 2020-09-16T22:06:33+05:30 IST