అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ డైరీ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-12-30T08:28:07+05:30 IST

తెలంగాణ అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌(టాడా) డైరీని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఆవిష్కరించారు. టాడా గౌరవ అధ్యక్షుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ఆగ్రోస్‌ ఎండీ కె.

అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అగ్రి డాక్టర్స్‌ అసోసియేషన్‌(టాడా) డైరీని మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఆవిష్కరించారు. టాడా గౌరవ అధ్యక్షుడు, కల్వకుర్తి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ఆగ్రోస్‌ ఎండీ కె. రాములు ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారుల బృందం కేటీఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా సంఘం డైరీని, క్యాలెండరును కేటీఆర్‌ ఆవిష్కరించారు. వ్యవసాయశాఖ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను సంఘం ప్రతినిధులు కేటీఆర్‌కు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - 2020-12-30T08:28:07+05:30 IST