ముగిసిన నైపుణ్యాభివృద్ధి శిక్షణా సదస్సు

ABN , First Publish Date - 2020-02-12T23:31:36+05:30 IST

భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి సహకారంతో పది రోజుల పాటు నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణా సదస్సు బుధవారం ముగిసింది.

ముగిసిన నైపుణ్యాభివృద్ధి శిక్షణా సదస్సు

 భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి సహకారంతో పది రోజుల పాటు నిర్వహించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణా సదస్సు బుధవారం ముగిసింది. షెడ్యూలు కులాల ఉప ప్రణాళిక నిధులతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ విద్యార్ధులకు వివిధ వ్యవసాయ సంబంధిత అంశాలలో పది రోజుల పాటు ఈ నైపుణ్యభివృద్ధి సదస్సు నిర్వహించారు. రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పర్చువల్‌ క్లాస్‌రూంలో నిర్వహించిన ఈ శిక్షనా కార్యక్రమంలో భవిష్యత్తు వ్యవసాయ అవసరాలకనుగుణంగా యాప్‌ల వినియోగం, వర్టికల్‌ గార్డెనింగ్‌, హైడ్రోఫోనిక్స్‌ డ్రోన్‌ల వినియోగం, ఆర్నమెంటల్‌షిప్‌ ఫార్మింగ్‌ మొదలైన అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు వివిధ అంశాలపై క్షేత్రస్థాయి పరిజ్ఞానం పెంపొందించే విధంగా శిక్షణ అందించారు. బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి డీన్‌ అగ్రికల్చర్‌ డా. జెల్లా సత్యనారాయణ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను విద్యార్ధులలో నైపుణ్యాభివృద్ది పెంచడానికి ఖర్చుచేయడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు. విద్యార్ధులు ఈ శిక్షనా కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను భవిష్యత్‌లో నూతన ఆవిష్కరణకు ఉపయోగించుకోవాలని సూచించారు.

Updated Date - 2020-02-12T23:31:36+05:30 IST