స్ట్రాంగ్‌ రూంల వద్ద ఏజెంట్లు కాపలా ఉండొచ్చు: ఈసీ

ABN , First Publish Date - 2020-12-01T08:21:49+05:30 IST

పోలింగ్‌ తర్వాత.. బ్యాలెట్‌ బాక్సులు ఉంచే స్ట్రాంగ్‌ రూంల వద్ద పోటీ చేసిన అభ్యర్థుల తరఫున ఏజెంట్లు కాపలా ఉండొచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి అభ్యర్థికి సంబంధించి ముగ్గురు ఏజెంట్ల

స్ట్రాంగ్‌ రూంల వద్ద ఏజెంట్లు కాపలా ఉండొచ్చు: ఈసీ

హైదరాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ తర్వాత.. బ్యాలెట్‌ బాక్సులు ఉంచే స్ట్రాంగ్‌ రూంల వద్ద పోటీ చేసిన అభ్యర్థుల తరఫున ఏజెంట్లు కాపలా ఉండొచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి అభ్యర్థికి సంబంధించి ముగ్గురు ఏజెంట్ల చొప్పున అనుమతిస్తామని వెల్లడించింది. అయితే, ఒకరు మాత్రమే కాపలా ఉండాలి. మిగతా ఇద్దరూ రిలీవర్లుగా ఉండొచ్చని... వీరందరూ స్ట్రాంగ్‌ రూమ్‌కు 100 మీటర్ల దూరంలోనే ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. బ్యాలెట్‌ బాక్సులపై ప్రిసైడింగ్‌ అధికారి సీల్‌ వేసే సమయంలో.. అభ్యర్థి లేదా వారి ఏజెంట్‌ కోరితే అనుమతిస్తారని వెల్లడించింది.  

Updated Date - 2020-12-01T08:21:49+05:30 IST