వయసు 19.. చోరీలు 50

ABN , First Publish Date - 2020-04-12T09:08:09+05:30 IST

ఇళ్లలో దొంగతనాలతోపాటు, ద్విచక్రవాహనాల చోరీ చేస్తున్న దొంగను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, కంచన్‌బాగ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి రూ.15 లక్షల వి లువైన చోరీసొత్తును

వయసు 19.. చోరీలు 50

  • రూ.15 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఇళ్లలో దొంగతనాలతోపాటు, ద్విచక్రవాహనాల చోరీ చేస్తున్న దొంగను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, కంచన్‌బాగ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి రూ.15 లక్షల వి లువైన చోరీసొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం కమిషనరేట్‌లో సీపీ అంజనీకుమార్‌ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి తండాకు చెందిన జనావత్‌ మహేశ్‌ (19) 15 ఏళ్ల వయసు నుంచే చోరీలు చేయడం ప్రారంభించాడు. 19 ఏళ్లు వచ్చేసరికి 50 చోరీలు చేశాడు. శనివారం కంచన్‌బాగ్‌ ప్రాంతంలో వాహనా ల తనిఖీలు చేస్తున్న సమయంలో ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అనుమానం వచ్చి పట్టుకున్నారు. విచారించగా... పలు చోట్ల చోరీలు చేసినట్లు అంగీకరించాడు. ఇతడిని అరెస్ట్‌ చేసి 37 తులాల బంగారు నగలు, 50 తులాల వెండి, ద్విచక్రవాహనం, కంప్యూటర్‌, 2 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-04-12T09:08:09+05:30 IST