‘దర్పణ్‌’తో10ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు!

ABN , First Publish Date - 2020-12-15T08:34:04+05:30 IST

మిస్సింగ్‌ కేసుల్లో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ పోలీసులు రూపొందించిన దర్పణ్‌ యాప్‌తో పదేళ్ల

‘దర్పణ్‌’తో10ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు!

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మిస్సింగ్‌ కేసుల్లో తప్పిపోయిన వారిని గుర్తించేందుకు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ పోలీసులు రూపొందించిన దర్పణ్‌ యాప్‌తో పదేళ్ల క్రితం తప్పిపోయిన బాలుడు, నేడు తన కన్నవారి చెంతకు చేరాడు.

మధ్యప్రదేశ్‌లోని కొట్వాలి ప్రాంతానికి చెందిన రవి శ్రీవాత్సవ కుమారుడు రాహుల్‌ శ్రీవాత్సవ మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. 2010 అక్టోబరు 7న అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.

వారం రోజుల తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ ప్రాంతంలో గుర్తించిన స్థానిక పోలీసులు.. అక్కడి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. దర్పణ్‌ యాప్‌ ద్వారా రాహుల్‌ను పోలీసులు గుర్తించడంతో పదేళ్ల తర్వాత తన 17 ఏళ్ళ వయస్సులో రాహుల్‌ తల్లిదండ్రుల చెంతకు చేరాడు.


Updated Date - 2020-12-15T08:34:04+05:30 IST