అర్బన్‌ఫారెస్ట్‌లలో ‘అడ్వెంచర్‌ రైడ్‌’

ABN , First Publish Date - 2020-10-12T21:58:22+05:30 IST

అర్బన్‌ఫారెస్ట్‌లకు సందర్శకులు, పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

అర్బన్‌ఫారెస్ట్‌లలో ‘అడ్వెంచర్‌ రైడ్‌’

హైదరాబాద్‌: అర్బన్‌ఫారెస్ట్‌లకు సందర్శకులు, పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఉన్న పలు అర్బన్‌ఫారెస్ట్‌ పార్క్‌లను పెద్దయెత్తున అభివృద్దిచేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, ఆహ్లాదకరమైన అడ్వెంచర్స్‌ను నిర్వహించే అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగానే మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట ఫారెస్ట్‌బ్లాక్‌ను కూడా సందర్శకుల కోసం ప్రత్యేకంగా అభివృద్దిచేస్తున్నారు. ఈమేరక ఇక్కడ అర్బన్‌ఫారెస్ట్‌ రైడ్‌ నిర్వహించిన ఈవెంట్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించినట్టు ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు.


తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ ఎఫ్‌డిసి) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌ (హెచ్‌సిజి) ఆధ్వర్యంలో జరిగిన అడ్వెంచర్‌ రైడ్‌ను టీఎస్‌ఎఫ్‌డిసి వైస్‌ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రఘువీర్‌ ప్రారంభించారు. 


కరీంనగర్‌ హైవేకు సమీపంలోని ఓఆర్‌ఆర్‌ వద్ద నుంచి అడ్వెంచర్‌రైడ్‌ జరిగింది. పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు పాల్గొన్నారు. టీఎస్‌ఎఫ్‌డిసి ఇప్పటికే ఫారెస్ట్‌ బాక్‌ల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా గ్యాప్‌ప్లాంటింగ్‌, యాదాద్రి తరహా మోడల్‌ ప్లాంటేషన్‌, ఎస్‌ఎంసి వర్క్స్‌, ఫారెస్ట్‌ ప్రాంతంలో వీడ్‌ను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా టీఎస్‌ఎఫ్‌డిసి కొండగొర్రె రీవైల్డింగ్‌ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. చిత్రక్‌ఆర్గనైజేషన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. 

Updated Date - 2020-10-12T21:58:22+05:30 IST