హైదరాబాద్‌లోని ఈ బంక్‌లో కల్తీ పెట్రోల్..!
ABN , First Publish Date - 2020-12-10T13:51:11+05:30 IST
హైదరాబాద్‌లోని ఈ బంక్‌లో కల్తీ పెట్రోల్..!

హైదరాబాద్/కుషాయిగూడ : చర్లపల్లి డివిజన్ నాగార్జుననగర్ కాలనీ ప్రధాన రహదారిపై ఉన్న ఓ బంకులో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం సాయం త్రం 5గంటల ప్రాంతలో భరత్ అనే యువకుడు పెట్రోలు పోయించుకుంటుడగా రంగు మారడాన్ని గుర్తించి సిబ్బందిని నిలదీశాడు. పెట్రోల్ కోసం వచ్చిన మరికొందరు వినియోగదారులు కూడా బంకు యజమానిని నిలదీశారు. దాంతో బంక్ యజమాని మరో బంక్‌లోని సిబ్బందిని రప్పించి పెట్రోల్ సాంధ్రతను పరీక్షించగా బాగానే ఉందని తేల్చారు.
అయితే ఒకే బంక్‌లో రెండు గన్నుల ద్వారా వేర్వేరు రంగులో పెట్రోలు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని వినియోగదారులు హెచ్చరిస్తూ నిష్క్రమించారు. ఐదేళ్ల క్రితం కూడా ఈ బంకులో ఇంధనం లీకేజీ వల్ల సమీపంలోని బోర్లలోని నీరు పెట్రోల్, డీజిల్ వాసన వస్తోందని పరిసర కాలనీల ప్రజలు ఫిర్యాదు చేశారు. అప్పట్లో బంకును మూసివేసి భూగర్భ ట్యాంకుకు మరమ్మతులు చేశారు.