జూ పార్కుల్లో ప్రవేశ రుసుము పెంచాలి: జపాట్
ABN , First Publish Date - 2020-12-30T08:29:04+05:30 IST
కరోనా వల్ల ఆదాయం తగ్గి నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో రాష్ట్రంలోని జూపార్కుల్లో ప్రవేశ రుసుము పెంచాలని జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(జపాట్) నిర్ణయించింది. ప్రవేశరుసుము
చిత్తడి నేలల గుర్తింపునకు కమిటీ: ఇంద్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): కరోనా వల్ల ఆదాయం తగ్గి నిర్వహణకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో రాష్ట్రంలోని జూపార్కుల్లో ప్రవేశ రుసుము పెంచాలని జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ(జపాట్) నిర్ణయించింది. ప్రవేశరుసుము పెంపును ప్రతిపాదించింది. ఇక్కడ అరణ్యభవన్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన జపాట్ పదో పాలకవర్గ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రధానంగా చర్చించారు. దేశంలోని ఇతర జూపార్కుల్లో ప్రవేశరుసుం ఎంత వసూలు చేస్తున్నారో పరిశీలించి, సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని పలుశాఖల సమన్వయంతో చిత్తడి నేలలను గుర్తించి, సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి స్పష్టీకరించారు.