పేదలకు ఆదిత్య ట్రస్ట్ చేయూత
ABN , First Publish Date - 2020-05-29T22:33:20+05:30 IST
లాక్ డౌన్ కారణంగా ఉపాధిలేక ఇబ్బందిపడుతున్న పేదలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్..

హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా ఉపాధిలేక ఇబ్బందిపడుతున్న పేదలకు ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చేయూత అందిస్తోంది. గోషామహల్ నియోజకవర్గంలో గత రెండు నెలలుగా పేదలకు కరోనాపై అవగాహన కల్పిస్తూనే వారానికి సరిపడ నిత్యవసర వస్తువుల కిట్లను అందజేస్తోంది. ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత నందకిషోర్ బిలాల్ ఆధ్వర్యంలో, చంద్రకిరణ్ బస్తీ దేవీనగర్, అంబేద్కర్ నగర్లో 800 మంది నిరుపేదలకు నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, ఇతర టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి సేవాకార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు నంద కిషోర్ బిలాల్ తెలిపారు. శనివారం నుంచి గోషామహల్ నియోజకవర్గంలో అందరికీ ట్రస్ట్ తరఫున కరోనా టెస్టులు చేయిస్తామని ఆయన చెప్పారు.