పేదల ఆకలి తీరుస్తున్న ఆదిత్య కృష్ణ ట్రస్టు
ABN , First Publish Date - 2020-05-17T17:03:14+05:30 IST
గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ..

హైదరాబాద్: గోషామహల్ నియోజకవర్గ పరిధిలో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ పేదల ఆకలి తీరుస్తోంది. లాక్ డౌన్ సందర్బంగా 48 రోజులుగా పేదలకు నిత్యవసరవస్తువులను ట్రస్ట్ ఛైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు నంద కిషోర్ బిలాల్ పంపిణీ చేస్తున్నారు. జాన్‌బాగ్‌లోని యాదవ్ సంఘం, చూడీ బజార్‌లోని గణేష్ టెంపుల్‌లో దాదాపు 600 మందికి నిత్యవసర సరుకులు అందజేశారు. ఈనెల 29 వరకు రోజుకు 500 మందికి నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని నందకిషోర్ బిలాల్ తెలిపారు. ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కరోనా కట్టడి కోసం అందరూ ఇళ్లల్లోనే ఉండాలని ఆయన కోరారు.