తాంసిలో వీఆర్వో రోహిత్‌పై మహిళా రైతుల దాడి
ABN , First Publish Date - 2020-11-03T22:40:31+05:30 IST
తాంసిలో వీఆర్వో రోహిత్‌పై మహిళా రైతుల దాడి
ఆదిలాబాద్: జిల్లాలోని తాంసిలో వీఆర్వో రోహిత్‌పై మహిళా రైతులు దాడి చేశారు. రికార్డుల్లో తన భూమిని తక్కువగా చూపాడని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ ప్రక్షాళనలో కప్పర్ల- వడ్డాడి గ్రామాల రైతుల భూములను వీఆర్వో రోహిత్ తక్కువగా నమోదు చేశాడని ఆరోపిస్తున్నారు. సవరణ కోసం రెండేళ్లుగా వీఆర్వో చుట్టూ రైతులు తిరుగుతున్నట్లుగా వాపోతున్నారు.