ఆదిలాబాద్‌ రిమ్స్‌లో కలకలం.. మర్కజ్ వెళ్లొచ్చి ఆస్పత్రికి డాక్టర్

ABN , First Publish Date - 2020-04-05T16:13:05+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి.

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో కలకలం.. మర్కజ్ వెళ్లొచ్చి ఆస్పత్రికి డాక్టర్

ఆదిలాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. మర్కజ్ వెళ్లొచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ డాక్టర్ మాత్రం ఈ విషయాలేమీ అస్సలు పట్టించుకోలేదు.


పూర్తి వివరాల్లోకెళితే.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో వైద్యుని నిర్వాకం బయటపడింది. మర్కజ్ వెళ్లొచ్చి కూడా ఆ వివరాలను వైద్యుడు అత్యంత గోప్యంగా ఉంచాడు. అంతేకాదు.. రెండు రోజుల క్రితం వరకూ ఆస్పత్రిలో విధులు నిర్వహించాడు. యథావిధిగా రోగులకు పరీక్షలు, శస్త్ర చికిత్సలు ఆ వైద్యుడు చేయడం గమనార్హం. అయితే విషయం తెలుసుకున్న అధికారులు ఆ వైద్యున్ని క్వారంటైన్‌కు తరలించారు. ఆదివారం నాడు ఆయన  రక్త నమూనాలు అధికారులు హైదరాబాద్‌కు పంపించారు.


ఈ ఘటనతో జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు రిమ్స్ వైద్య సిబ్బందిలో ఆందోళన నెలకొంది. అయితే.. హైదరాబాద్ నుంచి రిపోర్ట్ రావడానికి మరో 74 గంటలు పడుతుందని తెలుస్తోంది.

Updated Date - 2020-04-05T16:13:05+05:30 IST