ప్రగతిభవన్‌ను ముట్టడించిన ఆదిలాబాద్ రైతులు

ABN , First Publish Date - 2020-12-19T20:16:53+05:30 IST

పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా కాలయాపన చేస్తున్నందుకు..

ప్రగతిభవన్‌ను ముట్టడించిన ఆదిలాబాద్ రైతులు

హైదరాబాద్: పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా కాలయాపన చేస్తున్నందుకు ఆదిలాబాద్ రైతులు ప్రగతి భవన్‌ను ముట్టడించారు. ఆదిలాబాద్ నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రైతుల బీమా ఫసల్ యోజనకి గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టకపోవడంతో రైతులకు ఇన్సురెన్స్ రావడంలేదని ఆరోపించారు. తమ వాటా చెల్లించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వాటా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడంలేదన్నారు. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. 

Read more