అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-12-19T08:01:16+05:30 IST

పదో వేతన సవరణ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ అందించాలని ప్రభుత్వ

అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ ఇవ్వాలి

 ఆర్థిక మంత్రి హరీ్‌షరావుకు పెన్షనర్ల జేఏసీ వినతి

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పదో వేతన సవరణ కమిషన్‌ సిఫారసులకు అనుగుణంగా 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ అందించాలని ప్రభుత్వ పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ కోరింది. ఈ మేరకు  జేఏసీ చైర్మన్‌ విశ్వా్‌సరెడ్డి, సెక్రటరీ జనరల్‌ కె.లక్ష్మయ్య శుక్రవారం ఆర్థిక మంత్రి టి.హరీ్‌షరావును కలిసి వినతిపత్రం అందజేశారు.


2018 జూలై 1 నుంచి వేతన సవరణ పెండింగ్‌లో ఉందని, 60 శాతం ఫిట్‌మెంట్‌తో సవరించిన పెన్షన్‌ అందించాలని కోరారు. అన్ని ఆస్పత్రుల్లో నగదురహిత వైద్యాన్ని అమలు చేయాలన్నారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, మిగిలిన  వాటిని సీఎం దృష్టికి తీసుకెళతానని మంత్రి హామీ ఇచ్చారు. అఖిలభారత పెన్షనర్ల సమాఖ్య ప్రతినిధులు పూర్ణచందర్‌రావు, సుధాకర్‌, ఎం.వి.నర్సింగ్‌రావు తదితరులు ఉన్నారు.


Read more