ఇసుక దందాలో పోలీసులపై చర్య

ABN , First Publish Date - 2020-02-12T09:48:52+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లా తుంగభద్ర నదిలో టీఎస్‌ ఎండీసీ నుంచి అనుమతి లేకుండా వెళుతున్న ఇసుక లారీలను వదిలేయడంపై సీఐతో పాటు మరో

ఇసుక దందాలో పోలీసులపై చర్య

గద్వాల, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా తుంగభద్ర నదిలో టీఎస్‌ ఎండీసీ నుంచి అనుమతి లేకుండా వెళుతున్న ఇసుక లారీలను వదిలేయడంపై సీఐతో పాటు మరో ఐదుగురు హోంగార్డులపై వేటు పడింది. ఆదివారం ఆంధ్రజ్యోతిలో ‘‘ఆన్‌లైన్‌ హైజాకింగ్‌’’ శీర్షికన ప్రచురితమైన కథనానికి  అధికారులు స్పందించారు. తుమ్మిళ్ల, అలంపూర్‌ టీఎ్‌సఎండీసీ ఇసుక అమ్మక కేంద్రాల నుంచి లారీలను ఒక చోట బుక్‌ చేసుకొని మరోచోటికి తరలిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులను స్థానిక కాంట్రాక్టర్లు ప్రశ్నించినప్పుడు వారిపై కే సులు నమోదు చేస్తామని బెదిరింపులకు గురిచేసినట్లుగా కథనం ప్రచురితమైంది. ఈ ఘటనలో అలంపూర్‌ సీఐ రాజును ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలుస్తోంది. ఈ ఉత్తర్వులను అందుకున్న సీఐ పోలీసు వాహనంలో వచ్చి తన వాహనాన్ని హెడ్‌క్వార్టర్‌లో వదిలేసి ఒక ఆటోలో వెళ్లిపోతున్నట్లుగా వచ్చిన ఫొటో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సీఐతో పాటు గద్వాల డివిజన్‌లో మరో ఇద్దరిని, అలంపూర్‌ డివిజన్‌లో ముగ్గురు హోంగార్డులు ఇసుక వ్యవహారంలో బదిలీ చేసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-02-12T09:48:52+05:30 IST