‘సేవ’కు వేళాయె!
ABN , First Publish Date - 2020-10-04T07:41:58+05:30 IST
ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆదివారం నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు మొదలుకానున్నాయి.
నేటి నుంచి ఆలయాల్లో ఆర్జితసేవలు
పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అనుమతినివ్వడంతో ఆదివారం నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు మొదలుకానున్నాయి. లాక్‌డౌన్ కారణంగా మార్చి 23 నుంచి ఆలయాలను మూసివేశారు. జూన్ 8న పునఃప్రారంభమైనా.. ఆర్జిత సేవలకు అనుమత్వి లేదు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. యాదాద్రిలో ఆదివారం నుంచి సత్యనారాయణ వ్రతాలకు అనుమతి ఇస్తున్నా.. ఒక్కో బ్యాచ్‌కి 50 టిక్కెట్లు మాత్రమే ఇస్తామని, ఒక్కో టిక్కెట్‌పై ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని ఆలయ ఈవో గీత తెలిపారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న వేళ.. ఆర్జిత సేవలకు అనుమతి మంచి పరిణామమని జోగులాంబ ఆలయ ప్రధాన పూజారి ఆనంద్ శర్మ అన్నారు. కాగా.. అర్చకులకు, ఇతర సిబ్బందికి గ్రూప్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలంటూ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్ర శర్మ నేతృత్వంలో అర్చకులు, ఉద్యోగులు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.