ఏసీపీ నర్సింహారెడ్డి కేసు..

ABN , First Publish Date - 2020-10-07T08:20:16+05:30 IST

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు మంగళవారం రెండో రోజు విచారించారు. మాదాపూర్‌ సైబర్‌ టవర్స్‌ సమీపంలోని 2

ఏసీపీ నర్సింహారెడ్డి కేసు..

రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయనున్న ఏసీబీ

 వివరాలు కోరుతూ ఐటీ శాఖకు లేఖ


హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు మంగళవారం రెండో రోజు విచారించారు. మాదాపూర్‌ సైబర్‌ టవర్స్‌ సమీపంలోని 2 వేల గజాల ప్రభుత్వ స్థలం రిజిస్ట్రేషన్‌కు సంబంధించే ఏసీబీ అధికారులు ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.


అయితే, ఆయన పెద్దగా సహకరించలేదని తెలిసింది. దీంతో నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారో వివరణ ఇవ్వాలంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి లేఖ రాయనున్నారు. ఆ సమాచారం ఆధారంగా కొంతమంది రెవెన్యూ అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా, నర్సింహారెడ్డి ఆదాయం, పన్ను చెల్లింపుల సమాచారం కోరుతూ ఐటీ విభాగానికి లేఖ రాసినట్లు తెలిసింది. 

Read more