ఎల్‌వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అంతర్జాతీయ పురస్కారం
ABN , First Publish Date - 2020-12-17T09:20:38+05:30 IST
ఎల్‌వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సేవలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత గ్రీన్‌బర్గ్ ఔట్‌స్టాండింగ్ ఎచీవ్‌మెంట్

గ్రీన్‌బర్గ్ ఔట్‌స్టాండింగ్ ఎచీవ్‌మెంట్ అవార్డు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌వీప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సేవలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత గ్రీన్‌బర్గ్ ఔట్‌స్టాండింగ్ ఎచీవ్‌మెంట్ పురస్కారం ఎల్‌వీపీఈఐ మణిహారంలో చేరింది. గ్రామీ ణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అనుసరించిన ప్రణాళికకు గ్రీన్‌బర్గ్ అవార్డుల్లో ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ విభాగంలో పురస్కారం దక్కిందని ఆస్పత్రి ఫౌండర్, చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు తెలిపారు. సేవ చేయాలనే బలమైన కాంక్ష మనసులో ఉంటే, ప్రపంచంలో సాధించలేనిది ఏదీలేదన్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ కాటరాక్ట్ అండ్ రిప్రాక్టివ్ సర్జరీ అందించే ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుకు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు ఎంపికయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 2017 ఆఫ్తమాలజీ హాల్‌ఆఫ్ ఫేమ్‌కు ఎంపికైన ఇద్దరిలో ఆయన ఒకరు.