‘ఆచార్య’ షూటింగ్‌ వాయిదా

ABN , First Publish Date - 2020-03-15T09:24:02+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడికి.. సినిమా షూటింగ్‌ల వాయిదాకు మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిపాదించారు.

‘ఆచార్య’ షూటింగ్‌ వాయిదా

హైదరాబాద్‌, మార్చి 14: కరోనా వైరస్‌ కట్టడికి.. సినిమా షూటింగ్‌ల వాయిదాకు మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిపాదించారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తాను నటిస్తున్న సినిమా (ఆచార్య) షూటింగ్‌ను వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఇందుకు దర్శకుడు కూడా అంగీకరించారని తెలిపారు. ‘షూటింగ్‌లలో పెద్దఎత్తున సాంకేతిక నిపుణులు పాల్గొంటారు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 10 నుంచి 15 రోజులు చిత్రీకరణలు నిలిపివేయడం సమంజసమని భావిస్తున్నా. కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కరోనా నియంత్రణ ఉద్యమంలో సినీ రంగం కూడా పాలుపంచుకోవాలని కోరుతున్నా’ అని చిరంజీవి పిలుపునిచ్చారు.

Updated Date - 2020-03-15T09:24:02+05:30 IST