అడవి జంతువును ఢీకొన్న బైక్.. ఫారెస్ట్ ఆఫీసర్‌కు గాయాలు

ABN , First Publish Date - 2020-07-21T00:18:35+05:30 IST

అడవి జంతువును ఢీకొని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామ సమీపంలోని పరహాబాద్ చౌరస్తా దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే..

అడవి జంతువును ఢీకొన్న బైక్.. ఫారెస్ట్ ఆఫీసర్‌కు గాయాలు

నాగర్‌కర్నూల్: అడవి జంతువును ఢీకొని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామ సమీపంలోని పరహాబాద్ చౌరస్తా దగ్గర చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. సెక్షన్ ఆఫీసర్ బసిర్ మన్ననూర్ నుండి దోమలపెంటకు బైక్‌పై వెళ్తుండగా ఆమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామ సమీపంలోని పరహాబాద్ చౌరస్తా దగ్గర రోడ్డు దాటుతున్న ఓ అడవి జంతువును వేగంగా ఢీకొట్టాడు. దీంతో అదుపుతప్పి కింద పడిపోయాడు. ఈ ఘటనలో బసిర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. కాగా, అడవి జంతువు అక్కడికక్కడే మృతి చెందింది.

Updated Date - 2020-07-21T00:18:35+05:30 IST