మరో ఏసీపీపై ఏసీబీ దృష్టి !
ABN , First Publish Date - 2020-10-01T08:42:42+05:30 IST
పోలీసు శాఖలోని అవినీతి అధికారులపై వరుసగా కొరడా ఝలిపిస్తున్న ఏసీబీ తాజాగా మరో అవినీతి అధికారిపై దృష్టి సారించింది. అతనిపై చర్యలు తీసుకునేందుకు...
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలోని అవినీతి అధికారులపై వరుసగా కొరడా ఝలిపిస్తున్న ఏసీబీ తాజాగా మరో అవినీతి అధికారిపై దృష్టి సారించింది. అతనిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. విధుల్లో నిర్లక్ష్యం, అక్రమాల ఆరోపణలపై ఏసీపీ జయరాం రెడ్డిని సస్పెండ్ చేసిన నెల రోజుల్లోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీపీ నర్సింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నర్సింహారెడ్డి ఆస్తులు రూ. 100 కోట్ల వరకు ఉండొచ్చని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు మరో ఏసీపీ అవినీతిపై ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. తెలంగాణలోని ఓ కీలక కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ అవినీతి, ఆదాయంపై ఏసీబీకి సమాచారం అందింది. దీంతో అతనిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కానిేస్టబుల్ నుంచి ఏసీపీ స్థాయి అధికారి వరకు 8 మందిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది.