రంగారెడ్డి కలెక్టర్ కర్యాలయంలో ఏసీబీ సోదాలు

ABN , First Publish Date - 2020-08-20T20:26:51+05:30 IST

రంగారెడ్డి కలెక్టర్ కర్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

రంగారెడ్డి కలెక్టర్ కర్యాలయంలో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి కలెక్టర్ కర్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ. 5వేలు లంచం తీసుకుంటూ సర్వేయర్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డి పట్టుపడ్డారు. సర్వే రిపోర్టు కోసం లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఓ వ్యక్తికి భూమి సర్వే రిపోర్టు ఇవ్వడం కోసం వెంకటేశ్వరరెడ్డి లంచం డిమాండ్ చేయడంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఓ పథకం ప్రకారం గురువారం వెంకటేశ్వరరెడ్డికి ఆ వ్యక్తి లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని.. అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-08-20T20:26:51+05:30 IST