కామారెడ్డి సీఐ ఇంట్లో ఏసీబీ దాడులు
ABN , First Publish Date - 2020-11-21T10:08:48+05:30 IST
కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జగదీశ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో.. కామారెడ్డి పట్టణంలోని

కామారెడ్డి, నవంబరు 20: కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. జగదీశ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో.. కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న అతని ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిపారు. అడిషనల్ ఇన్‌చార్జి డీఎస్పీ ఎ.పి.ఆనందర్‌కుమార్ కథనం ప్రకారం.. ఉదయం 7 గంటలకే సీఐ ఇంట్లో సోదాలు ప్రారంభమయ్యాయి. ‘‘జగదీశ్ గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో కలప, గుట్కా అక్రమ రవాణాలో ఆయన ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. గత నెల కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టుబడ్డ ఐపీఎల్ బెట్టింగ్ ముఠాతోనూ సీఐ సంబంధాలు నెరిపినట్లు గుర్తించాం. వారి నుంచి రూ. 2 లక్షలు తీసుకున్నాడు. ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో.. వారు ఏసీబీకి ఫిర్యాదు చేశారు’’ అని ఆనంద్‌కుమార్ వివరించారు. కడపటి వార్తలందేసరికి.. ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.