రిమ్స్‌లో ఏసీబీ తనిఖీలు
ABN , First Publish Date - 2020-11-13T09:03:19+05:30 IST
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో..
ఆదిలాబాద్‌టౌన్, నవంబరు 12: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో అవినీతి జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు.
సిబ్బంది, వైద్యుల వేతనాల చెల్లింపులు, ఇతర రికార్డులను పరిశీలించారు. సుమారు గంటపాటు నిర్వహించిన ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.