ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో కొనసాగుతున్న ఏసీబీ విచారణ
ABN , First Publish Date - 2020-11-26T19:35:13+05:30 IST
కామారెడ్డి: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ కేసులో సీఐ జగదీష్‌కు సహకరించిన

కామారెడ్డి: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ కేసులో సీఐ జగదీష్‌కు సహకరించిన కామారెడ్డి పట్టణ ఎస్సై గోవింద్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ నిర్వహిస్తున్నారు. సీఐ జగదీష్ ఇంట్లో సోదాల సమయంలో ఎస్సై గోవింద్ ఫోన్ స్విచ్చాఫ్ చేసినట్టు గుర్తించారు. రెండు రోజుల నుంచి గోవింద్ విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే నేడు ఏసీబీ అధికారులు గోవింద్‌ను అదుపులోకి తీసుకున్నారు.