నాగరాజు బెయిలుకు ఏసీబీ కోర్టు ‘నో’

ABN , First Publish Date - 2020-09-05T08:59:50+05:30 IST

నాగరాజు బెయిలుకు ఏసీబీ కోర్టు ‘నో’

నాగరాజు బెయిలుకు ఏసీబీ కోర్టు ‘నో’

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజుకు బెయిల్‌ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించింది. నాగరాజుతో పాటు రియల్టర్‌ శ్రీనాథ్‌ యాదవ్‌, మధ్యవర్తి అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజును ఆగస్టు 14న ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. కోర్టు అనుమతితో నలుగురు నిందితులను మూడు రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. ఏసీబీ అధికారులు తమను విచారించాల్సింది ఏమీ లేదని, బెయిలు ఇవ్వాల్సిందిగా కోరుతూ నిందితులు ఏసీబీ కోర్టులో బెయిలు వ్యాజ్యం దాఖలు చేశారు. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిలిస్తే దర్యాప్తునకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు కోర్టుకు వివరించారు. దీంతో కోర్టు నిందితుల బెయిలు వ్యాజ్యాన్ని తిరస్కరించింది.

Updated Date - 2020-09-05T08:59:50+05:30 IST