ఆన్‌లైన్‌ తరగతుల కోసం స్మార్ట్‌ఫోన్లు ఇచ్చి సంబరపడొద్దు!

ABN , First Publish Date - 2020-06-16T10:19:15+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో బడులు బంద్‌ అయ్యాయి. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ తరగతులను

ఆన్‌లైన్‌ తరగతుల కోసం స్మార్ట్‌ఫోన్లు ఇచ్చి సంబరపడొద్దు!

  • పిల్లలపై నిఘా తప్పనిసరి
  • ఐఎస్‌ఈఏ మార్గదర్శకాలు విడుదల

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌తో బడులు బంద్‌ అయ్యాయి. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ తరగతులను ప్రోత్సహిస్తున్నాయి. విద్యాసంస్థలు ఇప్పటికే ఈ-తరగతులను ప్రారంభించాయి. అయితే.. అందుకోసం పిల్లలకు ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు ఇచ్చి సంబరపడకూడదని, వారిపై ఓ కన్నేసి ఉంచాలని హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తోన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇన్పర్మేషన్‌ సెక్యురిటీ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (ఐఎ్‌సఈఏ) హెచ్చరిస్తోంది. పిల్లలు ఎలకా్ట్రనిక్‌ గ్యాడ్జెట్లను సరైన రితీలో వినియోగిస్తున్నారా? లేదా? అని చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుందని పేర్కొంది. తల్లిదండ్రులందరూ సాంకేతికపరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, ‘డిజిటల్‌ పేరెంటింగ్‌’పై అవగాహన కలిగి ఉండాలని సూచించింది. ఈ మేరకు డిజిటల్‌ పేరెంటింగ్‌పై మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి..


  1. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ సమయంలో వ్యవహరించే తీరుపై పిల్లలను సిద్ధం చేయాలి. బోధన సమయంలో కలిగే ఇబ్బందులను ముందుగానే వివరించాలి. ఎవరైన వేధింపులు, బెదిరింపులకు దిగితే.. తక్షణమే సమచారం ఇచ్చేలా సూచనలు చేయాలి.
  2. పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో తరచూ తెలుసుకోవాలి. ఎంత పనిలో ఉన్నా అప్పడుప్పుడూ స్మార్ట్‌ఫోన్‌, ట్యాబ్‌లో చేస్తున్న కార్యకలాలపై నిఘా వేయాలి. 
  3. పిల్లలను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచాలి. నెటిజన్ల మనస్తత్వం గురించి తెలియజేయాలి. ఇంటర్‌నెట్‌లో ఎలాంటి వ్యక్తులు ఉంటారో స్పష్టంగా వివరించాలి.
  4. గాడ్జెట్లలో యాప్‌, గేమ్‌, ఇతర పైళ్లను డౌన్‌లోడ్లు చేయకుండా తల్లిదండ్రులు నియంత్రించాలి. అందుకు ప్రత్యేక యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయడమో.. డివైజ్‌ సెట్టింగ్‌లను మార్చడమో చేయాలి.
  5. ఇంటర్‌నెట్‌లో అశ్లీల లింక్‌లు వాటంతటవే ఓపెన్‌ అవుతుంటాయి. వాటిపై నియంత్రణ విధించాలి. 
  6. డైనింగ్‌, బెడ్‌రూంలలో వాటిని ఉపయోగించనివ్వొద్దు.

Updated Date - 2020-06-16T10:19:15+05:30 IST