ప్రాథమిక ఆధారాలతో సస్పెండ్‌ చేయొచ్చు

ABN , First Publish Date - 2020-03-18T09:11:35+05:30 IST

తన సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలుచేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ కొట్టివేసింది. ప్రాథమిక ఆధారాల ఆధారంగా...

ప్రాథమిక ఆధారాలతో సస్పెండ్‌ చేయొచ్చు

  • పాలనా ట్రైబ్యునల్‌ స్పష్టీకరణ
  • ఏబీవీ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తన సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలుచేసిన పిటిషన్‌ను కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ కొట్టివేసింది. ప్రాథమిక ఆధారాల ఆధారంగా సస్పెన్షన్‌లాంటి చర్యలు తీసుకోవచ్చని పేర్కొం ది. ఈ మేరకు క్యాట్‌ చైర్మన్‌ జస్టిస్‌ లింగాల నరసింహారెడ్డి, సభ్యుడు బీవీ సుధాకర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది.


నిఘా పరికరాల కొనుగోలు ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ప్రస్తుతం డీజీ హోదాలో ఉన్న వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూఏబీవీ క్యాట్‌ను ఆశ్రయించారు. రాజకీయ కక్షతోనే తనను సస్పెండ్‌ చేశారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి దాదాపు 8 నెలలుగా తనకు పోస్టింగ్‌, వేతనం ఇవ్వకుండా వేధింపులకు గురిచేసిందని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు. ఈ వాదనను క్యాట్‌ తోసిపుచ్చింది.

Updated Date - 2020-03-18T09:11:35+05:30 IST