ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రుణం తీర్చుకోలేనిదంటూ...
ABN , First Publish Date - 2020-04-01T18:03:02+05:30 IST
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మనసున్న చానల్ అని మరోసారి నిరూపించుకుంది.

కరీంనగర్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మనసున్న చానల్ అని మరోసారి నిరూపించుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికి వెళ్లలేక ఇబ్బందిపడుతున్న ఓ గర్భిణి కుటుంబానికి అండగా నిలిచింది. 10 రోజుల క్రితం కరీంనగర్‌లోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఓ గర్భిణి ప్రసవించింది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో కూలి చేసుకుని బ్రతికే వీళ్లకు ఇంటికి వెళ్లేందుకు వాహనాలు లేవు. 104, 108, 100కు డయల్ చేసినా ఫలితం లేకపోయింది.
దీంతో సమాచారం తెలుసుకున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆస్పత్రికి వెళ్లింది. బాధిత కుటుంబం బాధను బయటప్రపంచానికి తెలియజెప్పింది. ఏబీఎన్ చానల్లో ప్రసారం కాగానే ప్రభుత్వ పెద్దలు స్పందించారు. మంత్రి ఈటల రాజేందర్ పేషి నుంచి కాల్ చేశారు. స్థానిక మంత్రి గంగుల కమలాకర్ సిబ్బంది కూడా ఫోన్లో సమాచారం తెలుసుకున్నారు. అయితే అప్పటికే చొప్పదండి లీడర్ కొత్త జైపాల్ రెడ్డి తన సొంత డబ్బులతోపాటు.. తన సొంత డ్రైవర్‌ను ఇచ్చి ప్రత్యేక అంబులెన్స్‌లో బాధిత కుటుంబాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మహబూబాబాద్ పంపించారు. ఈ సందర్భంగా వేరే రాష్ట్రంలో ఉన్న జైపాల్ రెడ్డి ఏబీఎన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.