ఉద్యోగం ఇవ్వండి.. సింగరేణి గెస్ట్‌హౌస్‌ వద్ద యువకుడి హల్‌చల్‌

ABN , First Publish Date - 2020-12-16T05:28:46+05:30 IST

ఉద్యోగం ఇవ్వండి.. సింగరేణి గెస్ట్‌హౌస్‌ వద్ద యువకుడి హల్‌చల్‌

ఉద్యోగం ఇవ్వండి.. సింగరేణి గెస్ట్‌హౌస్‌ వద్ద యువకుడి హల్‌చల్‌
పురుగుల మందు డబ్బాతో భవనంపై యువకుడు

కాకతీయఖని, డిసెంబరు 15 : సింగరేణి గెస్ట్‌హౌస్‌ వద్ద ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. పురుగుల మందు డబ్బాతో భవనంపై ఎక్కాడు. కాంట్రాక్ట్‌ కార్మికుడైన తనను ఓ చోరీ కేసులో ఇరికించి ఉద్యోగం నుంచి తొలగించారని, విధుల్లోకి తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ సంఘటన భూపాలపల్లి సింగరేణి ఏరియాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అతడు తెలిపిన వివరాల ప్రకారం..  సామర్ల అనిల్‌ 2014లో భూపాపల్లి సింగరేణి గెస్ట్‌హౌ్‌సలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా చేరాడు. కొంకాలం బాగానే ఉన్నా తనకు సంబంధం లేని దొంగతనం కేసులో ఇరికించి 2019 డిసెంబర్‌ 29న విధుల నుంచి తొలగించారు. ఎన్నిసార్లు సింగరేణి అధికారులకు గోడు వినిపించినా మళ్లీ డ్యూటీలోకి తీసుకోలేదు. దీంతో తనకు ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నానని అనిల్‌ చెప్పాడు. విషయం తెలుసుకున్న సింగరేణి ఏరియా జీఎం నిరీక్షణ్‌రాజ్‌ అతడితో ఫోన్‌లో మాట్లాడారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో అనిల్‌ కిందికి దిగాడు.కాకతీయఖని, డిసెంబరు 15 : సింగరేణి గెస్ట్‌హౌస్‌ వద్ద ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. పురుగుల మందు డబ్బాతో భవనంపై ఎక్కాడు. కాంట్రాక్ట్‌ కార్మికుడైన తనను ఓ చోరీ కేసులో ఇరికించి ఉద్యోగం నుంచి తొలగించారని, విధుల్లోకి తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. ఈ సంఘటన భూపాలపల్లి సింగరేణి ఏరియాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అతడు తెలిపిన వివరాల ప్రకారం..  సామర్ల అనిల్‌ 2014లో భూపాపల్లి సింగరేణి గెస్ట్‌హౌ్‌సలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా చేరాడు. కొంకాలం బాగానే ఉన్నా తనకు సంబంధం లేని దొంగతనం కేసులో ఇరికించి 2019 డిసెంబర్‌ 29న విధుల నుంచి తొలగించారు. ఎన్నిసార్లు సింగరేణి అధికారులకు గోడు వినిపించినా మళ్లీ డ్యూటీలోకి తీసుకోలేదు. దీంతో తనకు ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నానని అనిల్‌ చెప్పాడు. విషయం తెలుసుకున్న సింగరేణి ఏరియా జీఎం నిరీక్షణ్‌రాజ్‌ అతడితో ఫోన్‌లో మాట్లాడారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో అనిల్‌ కిందికి దిగాడు.


Updated Date - 2020-12-16T05:28:46+05:30 IST