కాళేశ్వరంపై శ్వేతపత్రం విడుదల చేయించాలి
ABN , First Publish Date - 2020-12-30T08:06:54+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రాన్ని విడుదల చేయించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం గవర్నర్‌కు లేఖను
గవర్నర్‌కు పద్మనాభరెడ్డి లేఖ
హైదరాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేత పత్రాన్ని విడుదల చేయించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం గవర్నర్‌కు లేఖను రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ని ర్మాణ వ్యయం రోజు రోజుకు పెరిగిపోతోందని ఆయన ఆం దోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆయకట్టులోని ఎకరానికి రూ.4.39 లక్షల ఖర్చు అవుతుందని, వి ద్యుత్ బిల్లులు ఎకరానికి మరో రూ.10 వేల వరకు అవుతుందని ఆయన చెప్పారు.