పొగాకు నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-07-22T22:48:21+05:30 IST

రాష్ట్రంలో పొగాకు నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని, అవసరమైతే పొగాకును నిషేధించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.

పొగాకు నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి

హైదరాబాద్‌: రాష్ట్రంలో పొగాకు నియంత్రణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని, అవసరమైతే పొగాకును నిషేధించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆర్‌సీటీసీ వెబినార్‌లో జనం గళం విప్పి పొగాకుకు వ్యతిరేకంగా నినదించారు. పొగాకు రహిత సమాజం అందరి ఆశయమని భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచన రఘునందన్‌ అన్నారు. రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ టొబాకో కంట్రోల్‌ (ఆర్సీటీసీ) ఆధ్వర్యంలో పొగాకు రహిత తరం కోసం విద్యాసంస్థల పాత్ర అన్న అంశంపై జాతీయస్థాయి చర్చ జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండుదశాబ్ధాలుగా ధూమపానం హానికరం అని చేస్తున్న తన కృషిని ఆర్‌సిటీసీకి వివరించారు. నియంత్రణ రిసోర్స్‌ కేంద్రం న్యూఢిల్లీ వారి కార్యక్రమం తమ వాల్లు పొగాకు మానితే మేలు అని భావించే ఎంతో మందికి అండగా నిలిచిందన్నారు.


తెలంగాణ వ్యాప్తగా ఉన్న ప్రభుత్వ , ప్రైవేటు విద్యాసంస్దలు, అధికారులు, నాయకులు, సంఘ సేవకులు, ప్రజా ప్రతినిధులు ఈ వెబినార్‌లో పాల్గొన్నారని ఆయన వివరించారు. పాఠశాల ల్లో చదివి విద్యార్ధుల చేతే తమ బంధువుల చేత ధూమపానం మానేలా ప్రతిజ్ఞ చేయిస్తే మంచిదన్న సూచన చేసినట్టు ఆయన వివరించారు. దేశ వ్యాప్తంగా 900 మంది జూమ్‌ యాప్‌ ద్వారా పాల్గొన్న ఈ కార్యక్రమం యూట్యూబ్‌లో లైవ్‌గా ప్రసారం జరిగిందన్నారు. జాతీయ స్థాయిలో పొగాకుకు వ్యతిరే కంగా కృషి చేస్తున్న అధికార ప్రముఖుల చేత ఈ కార్యక్రమం నిర్వహించారు. పొగాకును పూర్తిగా నిషేధిస్తే మంచిదని వెబినార్‌లో పాల్గొన్న పలువురు అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2020-07-22T22:48:21+05:30 IST