ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఐక్యవేదిక ఏర్పడాలి

ABN , First Publish Date - 2020-10-04T08:17:31+05:30 IST

ఎన్‌కౌంటర్లు లేని ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఐక్యవేదికగా ఏర్పడి పోరాడాలని మావోయిస్టు పార్టీ ..

ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఐక్యవేదిక ఏర్పడాలి

మావోయిస్టు పార్టీ పిలుపు


హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : ఎన్‌కౌంటర్లు లేని ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఐక్యవేదికగా ఏర్పడి పోరాడాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్రజాస్వామిక నియంతృత్వ పాలన, బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా పౌరహక్కుల కోసం ఐక్య వేదిక పోరాడాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో మీడియాకు ఒక ప్రకటన వెలువడింది. ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, వ్యక్తులు, సంస్థలు కలిసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలన్నారు. 

Updated Date - 2020-10-04T08:17:31+05:30 IST