ప్రేమ జంట బలవన్మరణం

ABN , First Publish Date - 2020-06-18T09:24:04+05:30 IST

ప్రేమించిన వ్యక్తిని కాదని పెద్దలు ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేశారు.

ప్రేమ జంట బలవన్మరణం

  • యువతికి మరో పెళ్లి చేసినా ప్రేమికులు ఇద్దరూ ఉరి వేసుకున్నారు


నవాబుపేట, జూన్‌ 17 : ప్రేమించిన వ్యక్తిని కాదని పెద్దలు ఆ యువతికి మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అతనితో కలిసి జీవించలేక, తిరిగి వచ్చి ప్రియుడితో తాళి కట్టించుకొని ఇద్దరూ కలిసి చెట్టుకు ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకున్నారు.   వికారాబాద్‌ జిల్లా నవాబుపేట మండల పరిధిలో ఈ ఘటన జరిగింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకల కార్తీక్‌ (20), అదే గ్రామానికి చెందిన కటికె మీన (19) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే నెల రోజుల క్రితం మీణకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పెద్దలు వివాహం జరిపించారు. మీన కార్తీక్‌ను మరిచిపోలేక ఈ నెల 16న అత్తారింటి నుంచి వచ్చేసింది.  కార్తీక్‌తో తాళి కట్టించుకుంది. నవాబ్‌పేట మండలం పూలపల్లి గ్రామ సమీపంలో ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వీఆర్‌వో సత్తయ్య అందించిన సమాచారంతో నవాబుపేట ఎస్‌ఐ కృష్ణ, వికారాబాద్‌ డీఎస్పీ సంజీవరావు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాలను వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-06-18T09:24:04+05:30 IST