భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త

ABN , First Publish Date - 2020-04-15T08:29:36+05:30 IST

పుట్టింట్లో ఉన్న భార్యషేక్‌ షాహిన్‌బేగం(37)పై ఆమె భర్త షేక్‌ సాబేర్‌మియా పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున

భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి 


ధారూరు, ఏప్రిల్‌ 14: పుట్టింట్లో ఉన్న భార్యషేక్‌ షాహిన్‌బేగం(37)పై ఆమె భర్త షేక్‌ సాబేర్‌మియా పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. బాధితురాలు చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున  మృతి చెందింది. వికారాబాద్‌ జిల్లా ధారూరు మండల పరిధిలోని తరిగోపుల గ్రామంలో సోమవారం రాత్రి ఆమెపై దాడి జరిగింది. ఐదుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్నేహ వర్ష తెలిపారు.


షాహిన్‌ వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో సాబేర్‌మియా ప్రతిరోజు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీంతో ఆమె ఈ నెల 10న గ్రామంలోని పుట్టింటికి చేరుకుంది. సోమవారం రాత్రి సాబేర్‌మియా తన కుమారుడు రహ్మతుల్లా, అన్న షాబుద్దీన్‌, అతని కుమారులు షేక్‌ ఉబేదుల్లా, షేక్‌ కలీముల్లాతో కలిసి షాహిన్‌బేగం వద్దకు వచ్చి దాడి చేసి, హత్య చేశాడు.

Updated Date - 2020-04-15T08:29:36+05:30 IST