అట్రాసిటీ కేసులపై సమగ్ర సమీక్ష జరగాలి

ABN , First Publish Date - 2020-11-06T08:43:06+05:30 IST

రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమగ్ర సమీక్ష జరగాలని ఎస్సీ,

అట్రాసిటీ కేసులపై సమగ్ర సమీక్ష జరగాలి

 ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమగ్ర సమీక్ష జరగాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అన్నారు. గురువారం సంక్షేమ భవన్‌లో రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.


అట్రాసిటీ కేసులపై విచారణ అధికారి 60 రోజుల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. చార్జిషీటు, సాక్ష్యాలను సమర్పించడంలో పోలీస్‌ అధికారులది కీలక పాత్ర అని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. 


Updated Date - 2020-11-06T08:43:06+05:30 IST