జీహెచ్ఎంసీ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన కేంద్రబృందం

ABN , First Publish Date - 2020-04-28T20:29:46+05:30 IST

నగరంలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది.

జీహెచ్ఎంసీ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన కేంద్రబృందం

హైదరాబాద్: నగరంలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. నాలుగో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కేంద్రబృందం పరిశీలించింది. అంతుకుముందు కేంద్ర బృందం గుడిమల్కాపూర్ మార్కెట్‌ను సందర్శించారు. అక్కడ ఉన్న వ్యాపారులు, కొనుగోలుదారులతో మాట్లాడారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది తెలుసుకున్నారు.


 అలాగే నగరంలో ఉన్న కొన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో కూడా కేంద్రం బృందం పర్యటించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌లో అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కరోనాకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, ఎలా పరిష్కరిస్తున్నారన్నదానిపై చర్చలు జరుపుతున్నారు.

Updated Date - 2020-04-28T20:29:46+05:30 IST