నాగర్ కర్నూల్ జిల్లా: రైతుపై విరిగిన లాఠీ

ABN , First Publish Date - 2020-06-25T18:34:57+05:30 IST

ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాల కోసం వెళ్లిన ఓ రైతుపై పోలీసులు..

నాగర్ కర్నూల్ జిల్లా: రైతుపై విరిగిన లాఠీ

నాగర్ కర్నూల్ జిల్లా: ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ విత్తనాల కోసం వెళ్లిన ఓ రైతుపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగు చూసింది. కోడేరులో విత్తనాల కోసం రైతులు క్యూలో నిలుచున్నారు. ఓ మహిళా రైతు విత్తనాల కోసం లైన్‌లో ఉండగా ఆమె కుమారుడు పక్కన కూర్చున్నాడు. అలా కూర్చోకూడదంటూ పోలీసులు ఆ యువకుడిపై దాడికి దిగారు. అదేంటని మిగిలిన రైతులు ప్రశ్నించినా పూర్తిగా కొట్టిన తర్వాతే వదిలిపెట్టారు. పోలీసులు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లో ఉంటున్నారని నిలబడలేక పక్కన కూర్చున్నవ్యక్తిపై దాడి చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2020-06-25T18:34:57+05:30 IST