రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-11-26T08:11:25+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 993 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో కొత్తగా 993 కరోనా కేసులు

హైదరాబాద్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 993 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైర్‌సతో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజుతో పోలిస్తే పాజిటివ్‌లు స్వల్పం (72)గా పెరిగాయి. మంగళవారం 47,593 మందికి పరీక్షలు నిర్వహించారు. 695 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.

తాజాగా 1,150 మంది కోలుకున్నారు. 10,886 యాక్టివ్‌ కేసులకు గాను 8,594 మంది హోం/ ఇన్‌స్టిట్యూషనల్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, కొత్త కేసుల్లో 161 జీహెచ్‌ఎంసీలోనే నమోదయ్యాయి. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 93 మందికి పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-11-26T08:11:25+05:30 IST