రాష్ట్రంలో కొత్తగా 922 కేసులు..
ABN , First Publish Date - 2020-11-03T07:54:10+05:30 IST
ఎప్పటిలాగే ఈ ఆదివారం కూడా వైద్య ఆరోగ్యశాఖ కేవలం 25,643 కరోనా పరీక్షలే నిర్వహించింది. అందులో 922
7 మరణాలు
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఎప్పటిలాగే ఈ ఆదివారం కూడా వైద్య ఆరోగ్యశాఖ కేవలం 25,643 కరోనా పరీక్షలే నిర్వహించింది. అందులో 922 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో.. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,40,970కి పెరిగింది. ఆదివారం మరో ఏడుగురు చనిపోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,348కి చేరింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 256 పాజిటివ్‌లు నమోదు కాగా, మేడ్చల్‌లో 40, రంగారెడ్డిలో 56, కరీంనగర్‌లో 42, సంగారెడ్డిలో 4 కేసులు వచ్చాయి. కొత్తగా మరో 1,456 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కావడంతో.. ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,21,992కి పెరిగింది.