తెలంగాణలో కొత్తగా 894 కేసులు
ABN , First Publish Date - 2020-11-21T08:31:32+05:30 IST
తెలంగాణలో గురువారం మరో 894 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వైర్‌సతో నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 261728కు, మరణాలు 1,423కు చేరాయి

వైరస్ మరో నలుగురు మృతి
హైదరాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గురువారం మరో 894 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వైర్‌సతో నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 261728కు, మరణాలు 1,423కు చేరాయి. మరోవైపు రాష్ట్రంలో పరీక్షల సంఖ్య 50 లక్షలు 50,50,612కు చేరింది. ఇందులో మూడు నెలల్లోనే 45 లక్షల పరీక్షలు చేశారు. తాజాగా 1,057 మంది రికవరీ అయ్యారు. మొత్తం 2,47,790 మంది కోలుకున్నారు. 12,515 యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసుల్లో 154 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదయ్యాయి. మేడ్చల్‌లో 84, రంగారెడ్డి జిల్లాలో 70, నల్లగొండలో 48, భద్రాద్రి కొత్తగూడెంలో 54 కేసులు వచ్చాయి.