అగ్రికల్చర్‌ ఎంసెట్‌కు 89.8 శాతం హాజరు

ABN , First Publish Date - 2020-09-29T06:49:08+05:30 IST

అగ్రికల్చర్‌, వెటర్నరీ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌ మొదటి రోజు రెండు షిఫ్టుల్లో కలిపి 89.8 శాతం

అగ్రికల్చర్‌ ఎంసెట్‌కు 89.8 శాతం హాజరు

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 28: అగ్రికల్చర్‌, వెటర్నరీ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌ మొదటి రోజు రెండు షిఫ్టుల్లో కలిపి 89.8 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంసెట్‌ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ వై.నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం ఎనిమిది సెంటర్లలో నిర్వహించిన పరీక్షకు ఉదయం 2,033 మంది విద్యార్థులకు 1,850 మంది హాజరు కాగా, 183 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నం పరీక్షకు 1,398 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 1,278 మంది హాజరయ్యారని, 120 మంది గైర్హాజరైనట్లు వివరించారు. మొదటి రోజు రెండు షిప్టుల్లో మొత్తం 3,481 మంది విద్యార్థులకు 3,128 మంది(89.85 శాతం) విద్యార్థులు హాజరైనట్లు నరసింహారెడ్డి తెలిపారు.

Updated Date - 2020-09-29T06:49:08+05:30 IST