రాష్ట్రంలో ఒక్కరోజే 879 కేసులు

ABN , First Publish Date - 2020-06-24T02:48:45+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు గరిష్ట స్థాయిలో నమోదు అయ్యాయి. ఈ ఒక్క రోజే 879 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయి, ముగ్గురు చనిపోయారు. కాగా ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో అతి ఎక్కువ కేసులు

రాష్ట్రంలో ఒక్కరోజే 879 కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు గరిష్ట స్థాయిలో నమోదు అయ్యాయి. ఈ ఒక్క రోజే 879 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యాయి, ముగ్గురు చనిపోయారు. కాగా ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలో అతి ఎక్కువ కేసులు (652) నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని మరో 11 జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ తర్వాత మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. సోమవారం నాటి కేసులతో పోల్చుకుంటే ఈ రోజు 5 కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి.


నేటి కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,553కి చేరుకుంది. ఇందులో 4,224 మంది కరోనా నుంచి కోలుకోగా ప్రస్తుతం 5,109 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈరోజు చనిపోయిన ముగ్గురితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 220 మంది కరోనా కారణంగా చనిపోయారు.Read more