ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 8 కోట్ల 30 లక్షల విరాళాలు

ABN , First Publish Date - 2020-05-09T23:23:58+05:30 IST

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 8 కోట్ల 30 లక్షల విరాళాలు

ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 8 కోట్ల 30 లక్షల విరాళాలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 8 కోట్ల 30 లక్షల విరాళాలు అందాయి. ముఖ్యమంత్రి సహాయనిధికి శనివారం రోజు మంత్రి కే తారక రామారావు కార్యాలయం ద్వారా  భారీగా విరాళాలు అందాయి. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి, మూడు కోట్ల విలువైన పీపీఈలతోపాటు, ఎన్ 95 మస్క్ లను హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కే తారకరామారావుకు అందించారు.  ఐటీసీసీఎండీ సంజీవ్ పూరి ఇచ్చిన రెండు కోట్ల రూపాయల చెక్కుని మంత్రి కేటీఆర్ కు సంజయ్ సింగ్ అందిచారు. పోచంపాడ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయల విలువైన పీపీఈ కిట్లను మంత్రి కేటీఆర్ కు అందించింది. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్ 36 లక్షల 71 వేల రూపాయల చెక్కులను అందించింది. ఇండియన్ బ్యాంక్ ఎండీ, సీఈవో పద్మజా చుండూరు 30 లక్షల రూపాయలు, ఈవెంట్స్ నౌ ప్రైవేట్ లిమిటెడ్ 28 లక్షల రూపాయలు, తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ చిట్ ఫండ్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో  25 లక్షల రూపాయలు, లోల్ ప్లస్ ఇండియా లిమిటెడ్ 25 లక్షలు రూపాయలు, రాష్ట్ర స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయం తరఫున 23 లక్షల రూపాయలు, త్రిబుల్ లైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 20 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్ కు అందించారు.


Updated Date - 2020-05-09T23:23:58+05:30 IST