పీజీ ఈసెట్‌లో 7,774 మంది అర్హత

ABN , First Publish Date - 2020-12-07T09:09:26+05:30 IST

ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎం-ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పీజీ ఈసెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌ అర్హుల జాబితాను ప్రకటించారు

పీజీ ఈసెట్‌లో 7,774 మంది అర్హత

హైదరాబాద్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎం-ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి పీజీ ఈసెట్‌ మొదటి దశ కౌన్సెలింగ్‌ అర్హుల జాబితాను ప్రకటించారు. ఇందులో 7,774 మంది అర్హత సాధించారని పీజీ ఈసెట్‌ కన్వీనర్‌ రమేశ్‌బాబు తెలిపారు. అర్హత సాధించిన వారు ఈనెల 7, 8న వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, మొదటి దశ జాబితాను ఈనెల 10న విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈనెల 14 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని, రెండో విడత కౌన్సెలింగ్‌ తేదీలను త్వరలో వెల్లడిస్తామని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో చెప్పారు.

Updated Date - 2020-12-07T09:09:26+05:30 IST