ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌కు 7,078 మంది దరఖాస్తు
ABN , First Publish Date - 2020-12-15T08:54:53+05:30 IST
బీఈడీ కాలేజీల్లో ప్రవేశాల కోసం జరుగుతున్న ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌లో సోమవారం వరకు 7,078 మంది సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేశారని ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య

హైదరాబాద్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): బీఈడీ కాలేజీల్లో ప్రవేశాల కోసం జరుగుతున్న ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌లో సోమవారం వరకు 7,078 మంది సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేశారని ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య పి.రమేష్ బాబు తెలిపారు. మొదటిదశ కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్లు అప్‌లోడ్‌కు గురువారంవరకు గడువుందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 199 కళాశాలల్లో 17,600 సీట్లు ఉండగా ఇందులో కన్వీనర్ కోటాలో 13,200 సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలో 4400 సీట్లు భర్తీ చేయనున్నామన్నారు.