వైద్య శాఖకు 604 కొత్త పోస్టుల మంజూరు

ABN , First Publish Date - 2020-06-26T08:54:12+05:30 IST

వైద్య శాఖకు 604 కొత్త పోస్టుల మంజూరు

వైద్య శాఖకు 604 కొత్త పోస్టుల మంజూరు

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆరోగ్యశాఖకు 604 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రాస్‌ జీవో902 జారీ చేశారు. మంజూరైన వాటిలో 81 మెడికల్‌ ఆఫీసర్‌, 110 స్టాఫ్‌నర్సు, 329 ఏఎన్‌ఎం, 75 ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, 5 ఫార్మసిస్ట్‌, 4 ఎపిడెమాలజిస్ట్‌ పోస్టులున్నాయి. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌/ఔట్‌సోర్సింగ్‌ పద్దతిన ఏడాది కాలపరిమితితో భర్తీ చేస్తారు.

Updated Date - 2020-06-26T08:54:12+05:30 IST