నకిలీ ఈమెయిల్‌తో రూ.6.8 లక్షల టోకరా

ABN , First Publish Date - 2020-03-19T13:16:07+05:30 IST

నకిలీ ఈమెయిల్‌తో రూ.6.8 లక్షల టోకరా

నకిలీ ఈమెయిల్‌తో రూ.6.8 లక్షల టోకరా

హిమాయత్‌నగర్‌(ఆంధ్రజ్యోతి): నకిలీ ఈ మెయిల్‌తో ఓ కంపెనీకి రూ.6.8 లక్షలు టోకరా వేశారు సైబర్‌ నేరగాళ్లు. హైదరాబాద్‌లో పిత్తి ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ కంపెనీ ఉంది. కంపెనీ ఎకౌంటెంట్‌కు వారం రోజుల క్రితం సీఎండీ పేరిట ఓ ఈమేయిల్‌ వచ్చింది. తాను మీటింగ్‌లో బిజీగాఉన్నానని వెంటనే రూ.6.8 లక్షల ట్రాన్స్‌ఫర్‌ చేయాలని ఈ మెయిల్‌ సారాంశం. సీఎండీ పేరిట రావడంతో అకౌంటెంట్‌ డబ్బును పంపించాడు. ఈ మేరకు సీఎండీకి డబ్బు పంపించినట్టు మేసేజ్‌ చేశాడు. ఖంగుతున్న సీఎండీ తాను ఈ మెయిల్‌ పెట్టలేదని చెప్పాడు. వాకబు చేయగా అది నకిలీ ఈమెయిల్‌ అనితేలింది. కంపెనీ నిర్వాహకులు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-19T13:16:07+05:30 IST